🕉️ ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్
నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చి
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు పూజించి యబ్భానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్ జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు వీరాధులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్ మూకలై పెన్మూకలై
దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వైచి లక్ష్మణున్ మూర్ఛనొందింపగా
నప్పుడే పోయి సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగ
కుంభకర్ణాదుల న్వీరులం బోర
శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా
నంత లోకంబు లానందమై యుండ
విభీషణున్ పట్టాభిషేకంబు చేయించి
సీతామహాదేవినిన్ శ్రీరాముతో చేర్చి
అయోధ్యాపురిన్ జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయుండ
శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నీనామ సంకీర్తనల్ చేసితి
పాపముల్ లయమై భయముల్ దీరి భాగ్యముల్ కల్గునే
సకల సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యో భక్త మందార యో ధీర యో వీర
నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ నామ స్మరణతో
త్రైలోక్య సంచారివై హనుమంత ఓంకార రూపా
గ్రహ భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ త్యాదులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి సంహరించి
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే వ్రతపూర్ణహారి
నమస్తే నమో వాయుపుత్రా
నమస్తే నమో నమః 🙏

🕉️ Sanatana Hub లో భక్తుల కోసం సిద్ధం చేసిన
తెలుగు స్తోత్రాల సంపూర్ణ సంగ్రహం ఇది.
వేంకటేశ్వర స్వామి, శివుడు, హనుమాన్, దేవి, సూర్య భగవాన్, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు
సులభంగా చదవడానికి క్రింది విభాగాలను ఉపయోగించండి 🙏
0 Comments