🌼 రామచంద్రాయ జనక రాజజా మంగళం 🌼
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ॥ ॥రామ॥
కౌసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం ॥ ॥రామ॥
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం ॥ ॥రామ॥
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ ఘటిత దేహాయ చారు మంగళం ॥ ॥రామ॥
దేవకీ సుపుత్రాయ దేవ దేవోత్తమాయ
భావజాత గురువరాయ సర్వ మంగళం ॥ ॥రామ॥
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాత వాహనాయ అతుల మంగళం ॥ ॥రామ॥
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం ॥ ॥రామ॥
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం ॥ ॥రామ॥

0 Comments